నిర్మల్ పట్టణ విశ్రాంతి భవనంలో బుధవారం, ఇటీవల నియమితులైన టీపీసీసీ ఎస్సీ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కత్తెరపాక రాజేష్ గారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దమ్మ మహేష్, రెంజర్ల భోజన్న, నిగులాపు లింగన్న, లక్ష్మణ్, వెంకటస్వామి, సూర్యకాంతం, సట్టి సాయన్న తదితరులు పాల్గొన్నారు.