పంట పొలంలో ట్రాక్టర్ దగ్ధం

1చూసినవారు
పంట పొలంలో ట్రాక్టర్ దగ్ధం
లక్ష్మణచాంద మండలం పొట్టపెల్లి (కే) గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మంగళవారం వరి కొయ్యలకు నిప్పు పెట్టి దుక్కిదున్నుతున్న సమయంలో ట్రాక్టర్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. గాలికి మంటలు వ్యాపించడంతో, వాటిని ఆర్పేందుకు ప్రయత్నించిన శ్రీకాంత్, అశోక్ అనే ఇద్దరు యువకులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో అశోక్‌కు తీవ్ర గాయాలవ్వగా, శ్రీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్