సారంగాపూర్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర ప్రథమ చికిత్స సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలకు తగిన శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు కల్పించాలని ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్, నిర్మల్ జిల్లా వారు మండల తహసిల్దార్ కు వినతి పత్రం గురువారం సమర్పించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రోజి శశి కుమార్, ఉపాధ్యక్షులు పవార్ అరవింద్, గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్ ల ఆధ్వర్యంలో ఈ వినతి అందజేయబడింది. తాము గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.