ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రియుడితో వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Feb 28, 2026, 15:02 IST/

ప్రియుడితో వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య

Feb 28, 2026, 15:02 IST
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన జరిగింది. బగలగుంటే ప్రాంతంలో నివసిస్తున్న విద్యాజ్యోత్(27) ఓ ఐటీ సంస్థలో పనిచేస్తోంది. ఆమె కొడగు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకు ఆమె ఓ జ్యోతిష్కుడిని సంప్రదించింది. అయితే ప్రేమించిన వ్యక్తితో వివాహం విఫలమవుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యాజ్యోత్.. శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.