నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుక వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్ద వెంకటరమణ, నిర్మల్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బూర ఉమాశంకర్, సంఘ నాయకులు గుమ్మిడియాల దత్తాత్రి, మిట్టపల్లి నరసయ్య, కుల సభ్యులు పాల్గొన్నారు.