ప్రముఖ వైద్యులు, ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రుల మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఖానాపూర్, వైద్య విద్యార్థులకు బయో కెమిస్ట్రీ బోధిస్తూ, విలువలు, సామాజిక బాధ్యతను నేర్పిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి నిర్మల్ చలనచిత్ర సంఘం ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ టీచర్ 2026 ప్రశంసా పత్రం, శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నర్సయ్య, చారి, సెక్రటరీ రవి, కోశాధికారి కమలాకర్, కృష్ణ పాల్గొన్నారు.