టీయూసీఐ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ

1చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం టీయూసీఐ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. పాలకుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మిక శక్తులు ఉద్యమించిన రోజు మేడే అని, మేడే ఉత్సవాలను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, నారాయణ, సునీల్, భూమన్న, గంగాధర్, గంగామణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్