టియుసిఐ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ

0చూసినవారు
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని దేశాయి బీడీ ప్యాక్టరిలో మంగళవారం టియుసిఐ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. పాలకుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మిక శక్తులు ఉద్యమించిన రోజు మేడే అని పేర్కొన్నారు. మేడే ఉత్సవాలను కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్