తురాటి: భూ రీ సర్వేను పరిశీలించిన తహసిల్దార్ శ్రీకాంత్

0చూసినవారు
తురాటి: భూ రీ సర్వేను పరిశీలించిన తహసిల్దార్ శ్రీకాంత్
నర్సాపూర్ (జి) మండలం తురాటి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను తహసీల్దార్ శ్రీకాంత్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును, రికార్డుల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూ యజమానులు సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించి తమ భూముల వివరాలను సరిచూసుకోవాలని కోరారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులకు తహసిల్దార్ శ్రీకాంత్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్