పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా, టీయూటీఎఫ్ (Teachers' Union of Telangana Federation) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, డీఈఓ భోజన్నలకు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మురళీ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి రవికాంత్, వహీద్ ఖాన్, జిల్లా కోశాధికారి మేడారం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు వట్టోలి ముత్తన్న, నాయకులు పాండురంగాచారి, మతీన్, పోల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభకు, ఉపాధ్యాయుల కృషికి ఈ విజయం నిదర్శనమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.