నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫినగర్ కాలనీలో ఇద్దరు బాలికలను అపహరించి, అత్యాచారయత్నం కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కాలనీకి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ కలీమ్ లు బాలికలను అపహరించి వారిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాలికలపై నేరాలను సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.