నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ కాలనీలో ఆదివారం
బీజేపీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.