దాడి చేసి పారిపోయిన ఇద్దరు నిందితుల అరెస్ట్

1చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో వ్యక్తిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. ఈనెల 28న రాత్రి మయూరి హోటల్ లో భోజనం చేసి వెళ్తున్న సయ్యద్ గఫర్, అతని స్నేహితులను బైక్ పై స్పీడ్ గా వెళ్తున్న రాజుల దేవి ప్రమోద్, దేవర రాజ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మెల్లగా వెళ్లమని చెప్పినందుకు బండరాయితో దాడి చేసి పారిపోయారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్