నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం 11.15 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా, నిర్మల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ కోరారు.