జిల్లా కలెక్టర్ లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

1చూసినవారు
జిల్లా కలెక్టర్ లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. అధికారులు, సంఘ నాయకులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత వర్గాల హక్కుల కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయిధ పోరాటానికి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షునిగా వ్యవహరించారన్నారు. ఇటువంటి పోరాట యోధుల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :