భోసిలో రూ. 71 వేలు పలికిన వరసిద్ధి కర్ర వినాయక లడ్డూ

0చూసినవారు
భోసిలో రూ. 71 వేలు పలికిన వరసిద్ధి కర్ర వినాయక లడ్డూ
తానూర్ మండలం భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి, వేలం పాటలో స్వామివారి లడ్డూను పసుల భోజన్న రూ. 71, 000కు దక్కించుకున్నారు. అలాగే పాలక బలపం రూ. 12, 000, కండువా రూ. 5, 500, కాపీ పెన్ను రూ. 5, 100, చిన్న కండువా రూ. 2, 800కు వేలంలో ధర పలికాయి. భక్తుల ఉత్సాహంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, ఉత్సవాలకు వాడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్