తానూర్ మండలంలో విబిజీ రామ్ జీ రోడ్డు పనుల ప్రారంభం

3చూసినవారు
తానూర్ మండలంలో విబిజీ రామ్ జీ రోడ్డు పనుల ప్రారంభం
నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గం తానూర్ మండలంలోని మొగిలి గ్రామంలో బుధవారం విబిజీ రామ్ జీ పథకంలో భాగంగా కొత్త రోడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. గ్రామ సర్పంచ్ ఉషా - దర్శన్ ప్రత్యేక పూజలు చేసి ఈ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ రోడ్లు కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఫ్ఎ మానిక్, గ్రామపంచాయతీ కార్యదర్శి, స్థానిక నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్