నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం పరిసరాలను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి శనివారం పరిశీలించారు. ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, విగ్రహం చుట్టూ ఉన్న అపరిశుభ్రతను తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్, మాజీ కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.