కుబీర్ మండలం మర్లగూడ గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామానికి నీరు అందుతుండగా, నూతన సర్పంచ్ రాథోడ్ శ్యామ్ రావు దానిని నిలిపివేశారని వారు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.