విషు పూజ వేడుకల కరపత్రాలు ఆవిష్కరణ

0చూసినవారు
విషు పూజ వేడుకల కరపత్రాలు ఆవిష్కరణ
శబరిమలై అయ్యప్ప ఆలయం తరహాలో నిర్మల్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీన మంగళవారం విషు పూజ నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరించారు. స్థానిక గాంధీచౌక్ లోని మురళీకృష్ణ ఆలయం వద్ద మధ్యాహ్నం అన్నదానం, రాత్రి 7 గంటలకు మహా పడిపూజ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :