ఓటరు ప్రోజెని మ్యాపింగ్ వేగవంతం చేయాలి

1చూసినవారు
ఓటరు ప్రోజెని మ్యాపింగ్ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, 2002 నాటి వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్చి మ్యాపింగ్ ను పూర్తి చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) క్షేత్రస్థాయిలో వెళ్లి ఈ ప్రక్రియను చేపట్టాలని, రోజువారీ వివరాలను అందించాలని తెలిపారు. సహాయ బిఎల్ఓలు (ఎబిఎల్ఓలు) సహకరించాలని, పోలింగ్ బూత్ లలో ఇబ్బందులు ఎదురైతే సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్