ఆరోగ్య కేంద్రానికి వాటర్ ప్యూరిఫైయర్‌ అందజేత

1చూసినవారు
ఆరోగ్య కేంద్రానికి వాటర్ ప్యూరిఫైయర్‌ అందజేత
నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగుల సౌకర్యార్థం అడ్డా యూత్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి ఆర్థిక సహకారంతో వాటర్ ప్యూరిఫైయర్‌ను బుధవారం అందజేశారు. వైద్యురాలు హారిక మాట్లాడుతూ, వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అడ్డా యూత్ సభ్యులు వాటర్ ప్యూరిఫైయర్‌ను అందించడం అభినందనీయమని, సమాజసేవలో యువత ముందుండడం సంతోషకరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్