స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

2చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. జనరల్ స్థానాల్లో బీసీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల దోపిడీని ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 100% గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్