రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. 2028లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.