నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తాం

2చూసినవారు
నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తాం
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్, నాయుడువాడ, రాంరావు బాగ్, బంగల్ పేట్, బోయివాడ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈసారి నిర్మల్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్