నిర్మల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె 'గాంజా గస్తీ' బ్యానర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు, కట్టుదిట్టమైన నిఘా, ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.