జిల్లాలో డిసిఓగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన నర్సయ్య కుటుంబానికి జిల్లా అధికారులు మంగళవారం ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా చెక్కులు, జిల్లా అధికారుల సంఘం తరుపున నగదు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సయ్య కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.