నిర్మల్ మున్సిపాలిటీలో అత్యవసర సమావేశం నిర్వహించడంలో అంతర్యం ఏంటని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ ప్రశ్నించారు. మంగళవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఆయన సమావేశమయ్యారు. రంజాన్ పండుగ ఏర్పాట్లు, బిల్లుల కోసమే సమావేశం నిర్వహించారని, ఎజెండాలోని అంశాలను ఎందుకు చర్చించలేదని రాంనాథ్ ఆరోపించారు. చైర్ పర్సన్ అధికారులను వైస్ చైర్మన్ లాక్కోవడం, బీజేపీ కౌన్సిలర్ల ప్రశ్నలను దాటవేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.