ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవమిదేనా

2చూసినవారు
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవమిదేనా
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు జాతీయ రహదారులపై భారీగా మోహరించారు. యూనియన్ అధ్యక్షులు సుజాత మాట్లాడుతూ, "ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవమిదేనా?" అని ప్రశ్నించారు. ఆశావర్కర్లను అడ్డుకొని, అరెస్టులు, నిర్బంధాలకు రేవంత్ ప్రభుత్వం పాల్పడటం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్