ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం: కలెక్టర్ అభిలాష అభినవ్ అవగాహన ర్యాలీ ప్రారంభం

0చూసినవారు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని, జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్