వరల్డ్ విజన్ సేవలు అభినందనీయం: వడ్యాల్ సర్పంచ్

2చూసినవారు
నిర్మల్ జిల్లా, నిర్మల్ లక్ష్మణ్ చందా మండలంలోని వడ్యాల్ గ్రామంలో గురువారం వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో విభూది హరీష కుటుంబానికి వ్యాపార ప్రోత్సాహకంగా పలు సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా వడ్యాల్ గ్రామ సర్పంచ్ పసుపుల నరేష్ మాట్లాడుతూ, వరల్డ్ విజన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఇప్పటివరకు తమ గ్రామంలో సుమారు 30 పేద కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్