బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిలావర్ పూర్ మండల కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.