గోదావరిలో దూకి యువకుడు మృతి

0చూసినవారు
గోదావరిలో దూకి యువకుడు మృతి
మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమ పేరుతో యువతిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన యువకుడు సైతం గోదావరి నదిలో దూకి మృతి చెందాడు. వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేష్ (21) అదే గ్రామానికి చెందిన భూంపల్లి అఖిలను ప్రేమ పేరుతో వేధించగా, విసిగిపోయిన అఖిల ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నరేష్ కూడా అదే రోజు సాయంత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం మృతదేహాలను గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్