కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బంక సురేష్ (30) అనే ఆటో డ్రైవర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం తండ్రి నిద్రలేచి చూడగా సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు.