లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

31చూసినవారు
లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి ఈ ఎకనామిక్‌ సర్వేలో చెబుతారు.

సంబంధిత పోస్ట్