
మా తండ్రిని మళ్లీ చూడలేమేమో.. ఇమ్రాన్ ఖాన్ తనయుల ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనయులు ఖాసీం, సులేమాన్ ఖాన్ తమ తండ్రి జైలులో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అడియాలా జైలులోని నిర్బంధ గదిలో మురుగు నీరు, హెపటైటిస్తో బాధపడుతున్న ఖైదీల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని, ఆయనను ఏకాంతంగా ఉంచుతున్నారని ఖాసీం తెలిపారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ను కలిసిన ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్, ఆయన జైలులో సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.




