తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో ఆ పార్టీ చీఫ్ నితిన్ నబీన్ చేపట్టిన పర్యటన నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లో
బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొంటారు.