నితీశ్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

28826చూసినవారు
నితీశ్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి, తమ జాబితాలో చేర్చింది. ఒకే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన ఘనత అని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన లేఖలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్