క్యూట్ క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మూటగట్టుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. నానితో నటించిన 'నిన్నుకోరి' సినిమాతో మాంచి ఫేమ్ సాధించిన ఈ అమ్మడు.. ఈ మధ్యే '35 చిన్న కథ కాదు' సినిమాతో అలరించింది. అయితే కాసేపటి క్రితమే నివేదా థామస్ SMలో కొన్ని ఫొటోస్ అప్‌లోడ్ చేశారు. ఓనం పండుగ నేపథ్యంలో కేరళ సాంప్రదాయ చీరకట్టులో ఒక్కసారిగా తళుక్కుమన్నారు. దీంతో అభిమానులు.. కాస్త బొద్దుగా ఉన్నా కూడా చాలా క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.