రాఘవపూర్ శివారులో 9మంది జూదరుల అరెస్ట్

856చూసినవారు
రాఘవపూర్ శివారులో 9మంది జూదరుల అరెస్ట్
కామారెడ్డి జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కామారెడ్డి సి.సి.ఎ.స్ పోలీసు సిబ్బంది దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి జూదం కాయిన్స్, రూ. 73,110 నగదు, 2 మోటార్ సైకిళ్లు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్