ఆలూరు మండల కేంద్రంలో మన ఊరు, మన భద్రత, మన బాధ్యత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలూరు గ్రామంలో 24 సీసి కెమెరాలను ఏసిపి వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. ప్రజల భద్రతకు సీసి కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. సీఐ సత్య నారాయణ గౌడ్, సర్పంచి విజయ్, కార్యదర్శి రాజలింగం, పాలకవర్గ సభ్యులు, వీడీసీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.