నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పుప్పాల వరలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం నుంచి డాక్టరేట్ లభించింది. 'తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ చరిత్ర - నిజామాబాద్ జిల్లా ప్రత్యేకత 1920-2016' అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ప్రొ. రామకృష్ణ ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. వరలక్ష్మి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె బిడీలు చుడుతూనే ఇంటర్, డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు.