నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ నందిపేట్ మండలంలోని బాద్గుణ గ్రామంలో 'అమ్మకు అక్షరమాల' పరీక్ష ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా మహిళామణులు వేలిముద్రకు బదులుగా సంతకం చేయడం నేర్చుకోవాలని, తద్వారా సంఘంలో రుణ సదుపాయాలు, లావాదేవీలపై అవగాహన పెరుగుతుందని సర్పంచ్ చెలిమేల స్వప్న సుధన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎ సుమలత, నీరడి లత, బింగి వీణ, మహిళా సంగం సభ్యులు పాల్గొన్నారు.