ఆర్మూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఇటీవల రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా AMC చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు.