ఆర్మూర్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం, మామిడిపల్లికి చెందిన సాగరిక (30) తన భర్త రవికాంత్, అత్తమామలు, ఆడబిడ్డల వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పదేళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. గత ఐదేళ్లుగా అదనంగా 20 లక్షలు తీసుకురావాలని ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. మృతురాలి సోదరుడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.