నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ వాస్తవ్యులు ఆశపురం రజిత అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో సర్జరీ కోసం చేరారు.
కాంగ్రెస్ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 2,50,000 ల ఎల్ ఓ సీని బాధిత కుటుంబ సభ్యులకు ఆర్మూర్ పట్టణంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, పెద్ద గంగారెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.