ముగ్గురు వీడీసీ సభ్యులపై కేసు

6చూసినవారు
ముగ్గురు వీడీసీ సభ్యులపై కేసు
నందిపేట మేజర్ గ్రామ పంచాయతీలో మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వీడీసీ సభ్యులపై కేసు నమోదైంది. పంచాయతీ పాలక వర్గ సభ్యులు సర్పంచ్ సిలిండర్ లింగం అధ్యక్షతన తీర్మానం చేసి, కార్యాలయం ఎదుట పనులు ప్రారంభించారు. అయితే, వీడీసీలోని కొందరు సభ్యులు గుంతలు పూడ్చి, కంకరను చిందరవందర చేసి, తమకు చెప్పకుండా భవనం ఎలా నిర్మిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ కె. వినయ్ వివరాలు అందించారు.

ట్యాగ్స్ :