శనివారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతెన గ్రామంలో అక్రమ పేకాట శిబిరంపై మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు గురుడు కాపు సంఘం భవనంలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.