డొంకేశ్వర్ మండలంలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. సిర్పూర్ గ్రామానికి చెందిన రైతు పెద్దగొండ ముత్తెన్న ఇటీవల విక్రయించిన వడ్ల డబ్బులు రూ. 1,15,000 సిండికేట్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అయితే, 25వ తేదీన రైతు ఆధార్, సిమ్ కార్డు లాక్ అవ్వగా, 30న రూ. 50 వేలు, 20న రూ. 45 వేలు ఖాతా నుండి మాయమయ్యాయి. సాంకేతికతను అడ్డం పెట్టుకుని రైతన్న ఖాతా ఖాళీ చేసిన సైబర్ మాయగాళ్లపై ఆలస్యంగా కలకలం రేగింది.