పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి.

2చూసినవారు
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి.
ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఎంపీడీవో గంగాధర్, సీఐ సత్యనారాయణ గౌడ్ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీరు, షెడ్లు, లైట్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని ఎంపీడీవో అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఐ తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :